నెక్కొండ, ఫిబ్రవరి 18: చేనులో పడిన కోతులను తరుమబోతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… నెక్కొండ మండలం మడిపెల్లి శివారు తేజావత్ తండాకు చెందిన తేజావత్ వెంకన్న (42) మంగళవారం మక్క చేనుకు కాపలాగా వెళ్లాడు. వెంకన్న భార్య సునీత కూడా కొద్ది దూరంలోనే కాపలాగా ఉంది.
మధ్యాహ్నం చేనులోకి కోతులు రాగా వాటిని తరిమే క్రమంలో వెంకన్న ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. వెంటనే భార్య సునీత, గ్రామస్తులు వ్యవసాయబావి వద్దకు వెంకన్నను రక్షించేందుకు యత్నించగా అప్పటికే నీటిలో మునిగి మృతి చెం దాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.