Farmer : తెలంగాణలో యూరియా కోసం రైతులు నానా గోస అనుభవిస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఇకపై లైన్లలో నిలబడాల్సిన అక్కర్లేదంటూ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. కానీ యాప్‌లో యూరియా బుక్ చేసుకుని ఎరువుల కేంద్రానికి పోతే చాలా కేంద్రాల్లో్ స్టాక్ లేదని చెబుతున్నరు. దాంతో రైతు ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తుంది.
యాప్ కారణంగా రైతు మరింత గోస పడుతున్నడు. చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఇరుగుపొరుగును బతిలాడి యాప్‌లో యూరియా బుక్ చేసుకుని పోయినా.. ఎరువుల కేంద్రంలో యూరియా ఉండట్లేదు. అట్లెందుకు జరిగిందంటే.. ‘ఏమో మాక్కూడా తెల్వదు.. మా దగ్గర స్టాక్ లేకున్నా యాప్‌లో చూపిస్తున్నది’ అని చెబుతున్నరు.
ఈ క్రమంలో యూరియా కోసం లైన్లో నిలబడి విసిగిపోయిన ఓ రైతు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిది ముదనష్టపు పరిపాలన అని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏండ్లపాటు ఏకధాటిగా యూరియా బస్తాలు దొరికేటివని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు యూరియా దొరకక సావైతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు నడవ చేతగాకున్నా యూరియా కోసం రాకతప్పలేదని, తీరా వచ్చినంక లైన్ల నిలబడాల్సి వస్తున్నదని తన గోడు చెప్పుకున్నాడు.
నేను లైన్ల నిలబడలేక నా బదులుగా నిలబడమని ఒకాయనను బతిలాడి నిలబెట్టిన అని ఆ రైతు చెప్పారు. ఏట ఇట్లనే అయితే ఇగ నేను వ్యవసాయం చేయలేనని అన్నారు. రేవంత్ రెడ్డి మల్ల గెలువడని, వచ్చే ఎన్నికలల్ల గాలిలో కొట్టుకపోతడని అన్నారు. ఆ రైతు ఆవేదనను కింది వీడియోలో మీరే చూడవచ్చు..
రేవంత్ రెడ్డిది ముదనష్టపు పరిపాలన
కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏండ్ల పాటు ఏకధాటిగా యూరియా బస్తాలు దొరికాయి
యూరియా దొరకక నాకు సావైతుంది.. ఇంక నేను వ్యవసాయం చేయలేను
ఇంకోసారి కాంగ్రెస్ గెలవదు pic.twitter.com/BCkr31MUP4
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026