సూర్యాపేట : తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆందోళనకు గురైన గిరిజన రైతు(Farmer) మాలోతు అనిల్(27) పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు(Pesticides) తాగి ఆత్మహత్యాయత్నం(Committed suicide) చేసిన సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం బూర్గుల తండా గ్రామపంచాయతీ కి చెందిన లావూరి భారతి, మాలోతు మంగ్తి లకు పక్క పక్కనే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. కాగా, ఈనెల 4 న వరం చెక్కిన విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాల నడుమ తోపులాట జరిగింది.
ఈ నేపథ్యంలో బుధవారం లావూరి భారతి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చింది. సంఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కానిస్టేబుల్ పంపించామన్నారు. ఈలోగా ఇరు వర్గాల పెద్దమనుషుల మధ్య చర్చ జరుగుతుండగా గొడవ జరుగడంతో ఆందోళనకు గురై అనిల్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడని ఎస్ఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన హోంగార్డు వెంకటయ్య పురుగుల మందు బాటిల్ ను లాగేసుకున్నట్లు తెలిపారు. అనిల్ వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.