కామారెడ్డి, నవంబర్ 25: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన కుకాట్ల చిన్న మల్లయ్య (39)కు ఎకరన్నర భూమి ఉన్నది. వ్యవసాయంతోపాటు గొర్రె లు కాస్తుంటాడు. తనకు ఉన్న భూమిలో వరి సాగుచేశాడు.
రెండు రోజుల క్రితం ధాన్యం కాంటా పెట్ట గా.. దిగుబడి తక్కువగా వచ్చింది. దీం తో చేసిన అప్పు ఎలా కట్టాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు రూ.మూ డు లక్షల వరకు అప్పు ఉ న్నట్టు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్ తెలిపారు.