చేగుంట, డిసెంబర్ 25: అప్పుల బాధతో ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన రైతు బెదరబోయిన హరిబాబు (39) ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఫైనాన్స్‌లో తీసుకున్న ట్రాక్టర్‌ను, ద్విచక్రవాహనాన్ని ఇటీవల ఫైనాన్స్ వా రు తీసుకెళ్లారు.
గతంలో చేసిన అప్పులతో పాటు ఇటీవల మహిళా సంఘంలో రూ.2 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వ్యవసాయంలో నష్టాలపాలుకావడం, పంటను అమ్మగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.