జనగామ : భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Farmer attempted suicide) పాల్పడ్డాడు. తన భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన చెందిన సదరు రైతు కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..జనగామ మండలం పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే రైతు తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగు మందు తాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని హాస్పిటల్కు తరలించారు. తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తన భూమిని ఇతరులకు పట్టా చేశారని.. కలక్టరేట్ భవనం పైకిక్కి రైతు ఆత్మహత్యయత్నం
జనగామ – పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే రైతు కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగు మందు తాగాడు.
తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.… pic.twitter.com/jRSnsSwJoy
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2024