డిచ్పల్లి, నవంబర్ 14: రైతు భరోసా ఎప్పుడిస్తారని ఓ రైతు మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఆయన ఆ అంశాన్ని దాటవేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి.. డిచ్పల్లి, ఆర్మూర్, ఎడపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అయితే, డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు.
ఏమైనా ఇబ్బందులున్నాయా..? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఊహించని రీతిలో జూపల్లికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు..?’ అని రైతు పవన్ మంత్రిని ప్రశ్నించారు. సరిగా స్పందించని మంత్రి.. ఇక్కడికి వచ్చింది కేవలం రైతుల సమస్యలు తెలుసుకోవడానికేనని, రాజకీయాలు మాట్లాడవద్దని సమాధానం దాటవేశారు. దీంతో సదరు రైతు మౌనంగా ఉండిపోయాడు.