యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshminarasimha Swamy) కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్‌ను(Dormitory Hall) ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యుడు బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సుమారు1000 మంది భక్తులు(Devotees) నిద్రించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి భక్తులు యాదాద్రి కొండపై నిద్రించి మొక్కులు తీర్చుకునే అవకాశం కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.