సంగారెడ్డి :హైడ్రా(Hydraa) పేరుతో రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ (Doctor arrest) బండ్ల విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్‌పూర్‌లోని MCOR LLP project కు హైడ్రా నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తానని, కమిషనర్ రంగనాథ్‌ను మేనేజ్ చేస్తా అంటూ ప్రాజెక్ట్ ఓనర్ రాజేందర్ వద్ద విప్లవ్ సిన్హా రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంగారెడ్డి (Sangareddy) పోలీసులు విప్లవ్ సిన్హాను అరెస్ట్ చేశారు.
కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. కాగా, ఎవరైరా హైడ్రా పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read..