హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖా తంలో వాయుగుండం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్టు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ ప్రకటించింది.
శనివారం పలు జిల్లా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు.