కోటగిరి అక్టోబర్ 20 : సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికే తమ పూర్తి మద్దతు ఉంటుందని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల గౌడ సంఘం నాయకులు స్పష్టం చేశారు.
శుక్రవారం పొతంగల్, కోటగిరి మండలాల గౌడ కులస్థులు బాన్సువాడలో స్పీకర్ను మద్దతు తీర్మాన కాపీని అందజేశారు.