అమ్రాబాద్, మే 16 : ఓ భవనంపై నుంచి పడి చిన్నారి మృతి చెందగా.. మృతదేహాన్ని సంచిలో కుక్కి తరలించే యత్నం చేసిన అమానుష ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమ్రాబాద్ మండలం ఈగలపెంటలోని తెలంగాణ టూరిజం మృగవని విశ్రాంతి భవనం సమీపంలో చెంచు మ్యూజియం పనులు జరుగుతున్నాయి.
సంబంధిత సూపర్వైజర్ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లా నుంచి కూలీలను తీసుకొచ్చారు. వీరిలో అజయ్‌దాస్ మానిక్, లక్ష్మీవాణి దంపతులు కుటుంబంతో కలిసి రాత్రి వేళలో మృగవాని భవనం పక్కనే ఉన్న పాత భవనంపైకి వెళ్లి నిద్రపోయారు. రాత్రి సమయంలో చిన్నారి ఆరుషి మానిక్‌పూరి (5) భవనంపై నుంచి కిందపడగా తీవ్ర గాయాలై మృతి చెందింది. ఈ ప్రమాదం బయటకు తెలియకుండా దాచేందుకు సూపర్వైజర్ ఆ మృతదేహాన్ని సంచిలో కుక్కి బస్సులో తరలించేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి మృతదేహాన్ని అమ్రాబాద్ దవాఖానకు తరలించారు.