వికారాబాద్ : కారు అదుపుతప్పి చెరువు(Pond)లోకి దూసుకెళ్లిన(Car plunged) ఘటన జిల్లాలోని శివారెడ్డి పేటలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరికి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తుండగా సోమవారం ఉదయం మంచు కురుస్తున్న కారణంగా ముందు ఉన్న రోడ్డు సరిగా కనిపించక కారు అదుపు తప్పి శివరెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లినట్టు సమాచారం. చెరువులోకి దూసుకెళ్లిన కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది