హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన అబ్బాయి.. అమెరికా అమ్మాయిని వివాహమాడాడు. కాజీపేటకు చెందిన పుట్ట అరవింద్‌రెడ్డి అమెరికాలోని ఆబాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు.
అదే యూనివర్సిటీకి చెందిన వైద్య విద్యార్థిని జెన్నా బ్లోమర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు అంగీకరించడంతో ఆదివారం హసన్‌పర్తి మండలం చింతగట్టులోని బీజీఆర్ గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.
– హసన్‌పర్తి