రవీంద్రభారతి, జనవరి 3: ఏపీ ప్రభుత్వం తెచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చర్చించి తీసుకురావాలని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని గుండు సున్నా పెట్టారని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీసీలపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని, అందుకే బీసీలకు రక్షణ చట్టం అవసరమని స్పష్టం చేశారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 14 బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. పార్టీలు పబ్బం గడపడానికి బీసీలను వాడు కుంటున్నాయని మండిపడ్డా రు. ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ రక్షణ చట్టంపై చర్చించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, నాయకులు పగిళ్ల సతీశ్, మోదీ రామ్‌దేవ్ యాదవ్, మోరపాక సతీశ్, సీహెచ్ బాలయ్య పాల్గొన్నారు.