హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం కావాలన్న కేటీఆర్ కార్యాలయం నుంచి అవసరమైన సాయం అందిస్తుంటారు.
దీనిపై బెంగళూరుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి ‘మీకు బంగారం లాంటి హృదయం ఉన్నది. ప్రజలు, పిల్లలపై ప్రేమ ఉన్నది. దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలి సోదరా. మీరు దేవుడిలా చిరకాలం జీవించాలి’ అని ట్వీట్ చేశారు.
స్పందించిన మంత్రి.. ‘మనలో ఎవరూ శాశ్వతంగా ఇక్కడే ఉండరు. మనకు ఇతరులకు సాయం చేయగల సామర్థ్యం ఉన్నా సెల్ఫ్ లైఫ్ పరిమితమే. ఏదో నా శక్తి కొద్ది సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా అంతే. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సోదరా’ అని రిైప్లె ఇచ్చారు.
None of us is here forever. Limited life with very limited shelf-life where you have the ability to help others. Just trying to do my little bit; that’s all
But thanks brother for your kind words 🙏 https://t.co/oZmqWZ8PzB
— KTR (@KTRTRS) February 27, 2022