దేవరకద్ర, సెప్టెంబర్ 11: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు స్టేజీ సమీపంలో ఓ ఆడ శిశువు లభ్యమైంది. బుధవారం ఉదయం 6:30 గంటలకు దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్రెడ్డి వాకింగ్ వెళ్లగా.. రోడ్డు పక్కల శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్య క్తులు శిశువును బస్తాలో ఉంచి వెళ్లా రు. శిశువుకు చీమలు పట్టి ఉన్నట్టు గమనించారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మికి సమాచారం అందించగా.. ఆమె అక్కడికి చేరుకొని పసికందును స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా.. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగన్న శిశువును ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు.