మణికొండ, జూన్ 11: హైదరాబాద్ శివారులో 14 ఏండ్ల బాలుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. రోడ్డుపక్కన పార్క్ చేసిన దాదాపు 17 ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామ పరిధిలో ఓ బాలుడు బొలెనో కారు(టీఎస్ 09 సీ 8171 )ను రోడ్డుపై ఇష్టానుసారంగా నడుపుతూ 17 బైకులను ఢీ కొట్టాడు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. బాలుడికి కారిచ్చిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.