హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 99.8 శాతం పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఫామ్ల డిజిటలైజేషన్ మాత్రం 25.55 శాతమే జరిగిందని పేర్కొన్నది. శుక్ర వరకు సీఈవో కార్యాలయం అప్డేట్ చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 3,38, 26,448 మంది ఓటర్లకుగానూ 3,37,59,864 (99.8 శాతం) ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తవగాడిజిటలైజేషన్ 25.55 శాతం (86,41,844 ఫామ్లు) మాత్రమే పూర్తయింది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగానూ 13 జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 100 శాతం పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లకుగానూ 47,17,975 (99.61 శాతం) ఫామ్లు, రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది కిగారె 36,95,638 ఫామ్లను పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లాలో 98.93 శాతం పంపిణీ జరిగింది.