94.58 శాతం ఈఎఫ్ల పంపిణీ పూర్తి
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. నిర్మల్, జోగుళాంబ గద్వాల జిల్లాలు వందశాతం పంపిణీతో అగ్రస్థానంలో నిలిచాయి. నాగర్కర్నూల్ (99.98%), వనపర్తి (99.95%), జనగామ (99.94%) జిల్లాలు సైతం పంపిణీలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 81.51 శాతం, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 88.42 శాతం మేర ఈఎఫ్ల పంపిణీ జరిగింది.
డిజిటలైజేషన్లో యాదాద్రి ముందంజ.. మేడ్చల్ లాస్ట్
పంపిణీ చేసిన పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా సగటున 10.46 శాతానికి (35,39,214 పత్రాలు) చేరింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా 41.27 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 33.31 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక ఓటర్లు ఉన్న మేడ్చల్ మలాజిగిరి జిల్లా కేవలం 1.29 శాతం, హైదరాబాద్ జిల్లా 3.43 శాతం, రంగారెడ్డి జిల్లా 3.34 శాతంతో డిజిటలైజేషన్ ప్రక్రియలో చాలా వెనుకబడి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 47,39,135 కాగా.. 81.51 శాతం ఈఎఫ్ల పంపిణీ, 3.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. రంగారెడ్డిలో ఓటర్లు 36,99,743 కాగా.. 93.07% పంపిణీ, 3.44% డిజిటలైజేషన్ పూర్తయింది. మేడ్చల్ మలాజిగిరిలో మొత్తం ఓటర్లు 29,79,130 కాగా.. 88.42% పంపిణీ, 1.29% డిజిటలైజేషన్ పూర్తయింది. నల్లగొండలోమొత్తం ఓటర్లు 15,16,2 53 కాగా.. 99.47% పంపిణీ, 29. 43% డిజిటలైజేషన్ పూర్తయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

