హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51 శాతం పోలింగ్ నమోదయింది. నల్లగొండ లోక్సభ పరిధిలో 12.88 శాతం నమోదుకాగా, భువనగిరి పార్లమెంట్ పరిధిలో 10.54 శాతం, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 10.9 శాతం, ఖమ్మం ఎంపీ పరిధిలో 12.24 శాతం, ఆదిలాబాద్లో 13.2 శాతం, జహీరాబాద్లో 12.8 శాతం పోలింగ్ నమోదయింది.
రాష్ట్రవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు,106 నియోజకవర్గాల్లో సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3.32 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.