Banakacherla | బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మొండిపట్టు.. డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్!
Banakacherla | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ఏపీ మొండిగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) హైడ్రాలజీ అంచనా తేల్చినా ఏపీ ప్రభుత్వం ముందుకే సాగుతున్నది.
Banakacherla | హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ఏపీ మొండిగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) హైడ్రాలజీ అంచనా తేల్చినా ఏపీ ప్రభుత్వం ముందుకే సాగుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రాజెక్ట్ డిజైన్‌తో పాటు లిఫ్ట్‌లు, టన్నెళ్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్ చేయడం, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా రిపోర్టును తయారు చేయాలని నోటిఫికేషన్లో పేరొన్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.9.20 కోట్లు కేటాయించినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఏపీ ఇప్పటికే పూర్తిచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎకడెకడ ఏమేం నిర్మించాలో ముందే నిర్ణయం జరిగిందని, ఓ నిర్మాణ సంస్థ ద్వారా డీపీఆర్‌ను సిద్ధం చేయించారని చెప్తున్నారు. అయి తే, డీపీఆర్‌ను తాజాగా తయారు చేస్తున్నామని చూపేందుకే నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్నారన్న చర్చ జరుగుతున్నది. పోలవరం నుంచి బనకచర్ల వరకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది. అందులో భాగంగా బొల్లాపల్లి వద్ద 170 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని భావిస్తున్నది. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టి.. రా యలసీమకు నీటిని తరలించేందుకు కసరత్తులు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

