హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీటి ద్వారా ఇప్పటికే రూ.2,680 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు. లక్షకుపైగా దరఖాస్తులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, భారీ ఆదాయాన్ని ఆర్జించాలని ఆశించింది.
గడువు(అక్టోబర్ 18)నాటికి లక్ష్యం చేరకపోవడం తో.. అక్టోబర్ 23 వరకు దరఖాస్తుల గడువును పొడిగించింది. దీంతో ల క్ష్యం నెరవేరనున్నదని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా శంషాబాద్ నుంచి 8,110, తక్కువగా కుమ్రంభీంఆసిఫాబాద్ నుంచి 622, వనపర్తి 676, ఆదిలాబాద్ 711, జోగులాంబగద్వాల్ 723, నిర్మల్ నుంచి 942 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.