హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.984 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ట్టు చెప్పారు.
ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఆర్అండ్బీ ఆధీనంలోని 37 డివిజన్ల పరిధిలో 310 ప్రాంతాల్లో కాజ్‌వేలు, కల్వర్టులు వరదల వల్ల ప్రభావితమైనట్టు, 232 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపారు. మొత్తంగా 200చోట్ల రోడ్లు, కాజ్‌వేలు, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నట్టు వివరించారు.