హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ప్రత్యేక వైద్య బృందాలు రోజుకు సగటున 2 లక్షల మందికి నేత్రపరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 84 లక్షల మందికి పరీక్షలు పూర్తయ్యాయి. దృష్టిలోపాలు ఉన్నాయేమోన్న అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. తిరిగి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరి ముఖంలోనూ సంతోషం కనిపిస్తున్నది. ఇందుకు రెండు రకాల కారణాలు ఉన్నాయి.
చూపు బాగున్నదని సంతోషం
కంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత కొందరికి ఎలాంటి లోపాలు లేవని తేలుతున్నది. దీంతో వారు ఇన్నాళ్లూ తాము కంటిచూపు తగ్గిందేమోనని మానసికంగా ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు అనుమానం తొలిగిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షలు చేసుకున్నవారిలో 59.96 లక్షల మందికి ఎలాంటి లోపాలు లేవని తేలింది. ఇది మొత్తం సంఖ్యలో 70.87 శాతానికి సమానం.
Kantivelugu1
కండ్లద్దాలు వచ్చాయని ఆనందం
కంటి పరీక్షల అనంతరం కొందరిలో దృష్టిలోపాలను గుర్తిస్తున్నారు. అవసరం ఉన్నవారికి అక్కడికక్కడే కండ్లద్దాలు అందజేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 14.23 లక్షల మందికి కండ్లద్దాలు (రీడింగ్ గ్లాసెస్) అందజేశారు. మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్‌ను రెఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 10.42 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించారు. వారికీ ఉచితంగా కండ్లద్దాలు అందుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18.62 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు.
సగానికిపైగా పూర్తయిన లక్ష్యం
Kanti