హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూర్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
ఆరు నెలల్లో 938 కేసులు నమోదు చేసి, 1921 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. 938 డ్రగ్స్ కేసుల్లో గంజాయి కేసులే 816 ఉన్నాయి. 1921 మంది నిందితుల్లో 1649 మంది గంజాయి పెడ్లర్స్ ఉన్నట్టు వెల్లడించారు. 5 కేసుల్లో నిందితులకు చెందిన రూ.47.16 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు చెప్పారు.
తెలంగాణలో డ్రగ్స్‌ను రూపుమాపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, టీజీ న్యాబ్ వారికి అవసరమైన పరికరాలు, సామగ్రి, వాహనాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.