హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గృహ హింస కేసులను పరిషరించడంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గణనీయ పురోగతి సాధించిందని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్ తెలిపారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 వేల కేసులు నమోదయ్యాయని, 8,200 కేసులను పరిష్కరించామని ప్రకటించారు. 63.2 శాతం మద్యపాన వ్యసనం వల్లనే చోటుచేసుకున్నాయని, నిందితుల్లో గ్రాడ్యుయేట్లు 26 శాతం ఉన్నారని తెలిపారు.