కొల్లాపూర్, నవంబర్ 13 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో వేలాది ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చినా.. నల్లమల అడవిలో ఇప్పటివరకు 800 ఎకరాలు కబ్జాపాలైందని ఫారెస్టు డివిజినల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 11న నార్లాపూర్ సెక్షన్ పరిధిలో 15 ఎకరా ల్లో అడవిని నరికి చదును చేస్తున్న ఆక్రమణదారులను అడ్డగించిన సమయంలో సెక్షన్ అధికారి జయరాజ్తోపాటు సిబ్బందిపై కొందరు విచక్షణా రహితంగా దాడికి తెగబడినట్టు తెలిపారు.
నెల రోజులుగా శ్రీరాములు కుటుంబ సభ్యులు అడవిలోని చెట్లను నరికినట్టు టైంలైన్ మ్యాప్ ప్రకారం వెల్లడైనట్టు వివరించారు. ఇటీవల ఆక్రమణకు గురైన 10 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.