హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో 8 ఇంజినీర్లకు చీఫ్ ఇంజినీర్లుగా ప్రమోషన్లు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్ ఎస్ఈ సత్యనారాయణరెడ్డికి మహబూబ్‌నగర్ సీఈగా, ఎం సత్యనారాయణరెడ్డికి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈగా, కాగజ్‌నగర్ ఎస్ఈ కుమారస్వామికి ములుగు సీఈగా, భువనగిరి ఎస్ఈ వీ శ్రీనివాస్‌ను గజ్వేల్ సీఈగా, కొత్తగూడెం ఇన్చార్జి సీఈ ఏ శ్రీనివాసరెడ్డిని పూర్తిస్థాయి సీఈగా, పెద్దపల్లి ఎస్ఈ సత్యరాజచంద్రకు మంచిర్యాల సీఈగా, వరంగల్ ఎస్ఈ వెంకటేశ్వర్లుకు వరంగల్ సీఈగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఇదిలా ఉండగా ఇటీవలే మొత్తంగా 13 మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్లను కల్పించాలని నిర్ణయించారు. ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలకు డీపీసీ (డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సైతం ఆమోదం తెలిపింది. అయితే పలు సీఈ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయలేదు. మరోవైపు డీపీసీ ఆమోదం తెలిపినా కేవలం 8మందికి మాత్రమే ప్రమోషన్లు కల్పించడం గమనార్హం.