నిజామాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్తారు. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 8 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని గోదావరికి వదిలిపెడుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ నీటిమట్టం 1091 అడుగులకుగాను 1088.30 అడుగులకు చేరింది. కాగా, ప్రాజెక్టులోకి 10 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు.