మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున్నాడు. అద్దె ఇంట్లోని ఇరుకు గదిలో చదువుకోలేకపోతున్నానని ఆవేదన చెందాడు.
బాలుడి కష్టాలు చూసి చలించిన సబితా ఇంద్రారెడ్డి వెంటనే విష్ణు కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ‘నువ్వు కోరుకుంటున్నట్టే ఇల్లు మంజూరు చేస్తున్నా. నువ్వు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అని ఆ బాలుడిని ఆశీర్వదించారు.
-మహేశ్వరం