హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల జూనియర్ కాలేజీకి భవన నిర్మాణం కోసం రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా, కొడంగల్‌లోని బీసీ గురుకుల పాఠశాలలో అదన పు వసతుల కల్పనకు రూ.23.45కోట్ల తో, బొమ్రాస్పేట మండలం బుర్హాన్‌పూర్‌లోని ఎంజేపీ బీసీ బాలికల స్కూ ల్, కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గురువారంవేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.