హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదేండ్ల సంక్షేమ పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం తమకు గర్వకారణమని అన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను కేసీఆర్ తగ్గించగలిగినప్పుడు మహారాష్ట్రగానీ, ఇతర రాష్ర్టాలుగానీ ఎందుకు తగ్గించలేకపోతున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో 2014 నుంచి పదేండ్లకాలంలో రైతుల బలవన్మరణాలు తగ్గాయని ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికపై కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
అప్పటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్ల 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెకలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలో రెండోస్థానంలో ఉన్న తెలంగాణ.. 2023 నాటికి 14వ స్థానానికి పరిమితమైందని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ 2023 లెకల ప్రకారం దేశవ్యాప్తంగా 10,786 మంది (10.9 శాతం) రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో తెలంగాణ వాటా 0.51శాతమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 1,347 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2023 నాటికి ఆ సంఖ్య 56కి తగ్గిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ రెండేండ్లలోనే 700మందికిపైగా ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తంచేశా రు. రైతులు చల్లగా ఉండాలని, నూరేండ్లు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతులేని అరాచకత్వం, అపరిమితమైన అజ్ఞానం రాజ్యమేలుతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కాంగ్రెస్ సరార్ కాదని, సరస్ అని ఎక్స్‌లో ధ్వజమెత్తారు.
‘స్థానిక సమస్యలు తీర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని
పత్రికలకెకుతాడు
పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!
భారీ వర్షాల వల్ల
నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే
రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని
ఏకంగా ప్రపంచ బ్యాంకుకే
ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు
ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!
రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు
సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి
పరిశ్రమనే తగులబెడతానని
బెదిరించి రౌడీయిజం చేస్తాడు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!
అంతులేని అరాచకత్వం,
అపరిమితమైన అజ్ఞానమూ
రాజ్యమేలుతున్నాయి..
నేడు తెలంగాణలో
సరారు కాదిది సరసే!’
అని కేటీఆర్ ట్వీట్ చేశారు.