పెద్దఅంబర్‌పేట, మార్చి 9 : పెద్దఅంబర్‌పేట పరిధిలోని ఓ ఐఐటీ క్యాంపస్‌లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వారు అల్పాహారంలో చపాతీ, ఆలుకుర్మా తీసుకున్నారు. రెండు గంటల తర్వాత 70 మం దికిపైగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. దీంతో వైద్యులను క్యాంపస్‌కు రప్పించి చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని క్యాంపస్ ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగినా తమను కాలేజీ లోపలికి అనుమతించడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. హయత్‌నగర్ సీఐ నాగరాజుగౌడ్ క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థినులను విచారించారు. తుర్కయాంజాల్ పరిధిలోని క్యాంపస్‌లోనూ శనివారం రాత్రి పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా.. వారిని దవాఖానకు తరలించినట్టు తెలుస్తున్నది.