అబిడ్స్, అక్టోబర్11: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 70 మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళిత రత్న మాణిక్‌రావు నేతృత్వంలో గుజరాతీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు గుజరాతీలు తెలిపారు. కేసీఆర్ పాలన దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కేసీఆర్‌తోనే బంగారు భారత్ సాధ్యమవుతుందని దళిత్త్న్ర మాణిక్‌రావు అన్నారు. కార్యక్రమంలో సూరత్ స్కూల్, కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం గోపి, మక్తల్ నియోజకవర్గం సర్వమండల్ వైస్ ఎంపీపీ దండు శంకర్ వినావతి, సూరత్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అడ్వకేట్ దీపక్ మహాజన్, మునాల్ గాజువా, లలిత్ షా తదితరులు పాల్గొన్నారు.