జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్టుల బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.
బాధితులు హసన్‌పర్తి మండలం దేవన్నపేట వాసులుగా గుర్తించారు. గోవా పర్యటనకు వెళ్లొస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.