బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 02:38:46

ఏపీలో కొత్తగా 67 కేసులు

ఏపీలో కొత్తగా 67 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,650కి చేరింది. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 491 కేసులు ఉన్నాయి. 524 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టానికి వచ్చే వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. వలస కార్మికులతోపాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను, విద్యార్థులను కూడా అనుమతిస్తామని ఆయన తెలిపారు.


logo