హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతున్నారు. ఇక గుణకారం చేయగలిగిన వారు కేవలం 40% మాత్రమే. నాలుగో తరగతిలో భాగహారం చేసే సామర్థ్యాలున్నది కేవలం 19.2% మందికి మాత్రమే. గుణకారం చేయగలిగే వారు 35.6శాతమే. నాలుగో తరగతిలో ఇంగ్లిష్‌లో మౌఖిక పఠన పటిమ గల వారు 51% మాత్రమే. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గల విద్యార్థులకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో సామర్థ్యాలపై బేస్‌లైన్ టెస్టు నిర్వహించారు.
2025 నవంబర్25 నుంచి 30 వరకు ఈ బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించారు. 96% విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ బేస్‌లైన్ టెస్ట్ ఆధారంగా అధికారులు ఓ నివేదిక రూపొందించారు. ఆయా నివేదికను పరిశీలిస్తే.. సర్కార్ బడుల్లోని విద్యార్థుల్లో సామర్థ్యాలు పూర్తిగా మెరుగుపడలేదనిపిస్తున్నది. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ-ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేయడానికి ఎఫ్ఎల్ఎన్ సెల్‌ను సైతం ఏర్పాటు చేశారు. మొదట బేస్‌లైన్ టెస్టు నిర్వహించగా, అందులోనూ ఆశాజనక ఫలితాలేం రాలేదు.
మిడ్లైన్ టెస్ట్ ఫలితాలిలా..