శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:42:51

మైక్రో ఇరిగేషన్‌కు రూ. 600 కోట్లు కేటాయింపు

మైక్రో ఇరిగేషన్‌కు రూ. 600 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. బిందు, తుంపర సేద్యాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈ సేద్యం వల్ల తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం వస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మైక్రో ఇరిగేషన్‌కు ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలకు 100 శాతం, బీసీలు, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. ఇప్పటి దాకా 2,49,200 మంది రైతులకు ఈ పథకం ద్వారా రూ. 1,819 కోట్ల లబ్ధి చేకూరిందని మంత్రి చెప్పారు. మొత్తంగా ఈ ఏడాది మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ. 600 కోట్లు ప్రతిపాదించడం జరిగిందని హరీష్‌రావు పేర్కొన్నారు.


logo