Premature Infant | వేలేరు, నవంబర్ 14 : ఆరు నెలలకే జన్మించిన శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ ద్వారా ప్రాణం పోసిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం లోక్యాతండాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన భూక్యా అఖిల ఆరు నెలల గర్భవతి. అయితే నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది అఖిలను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మగ శిశువుకి జన్మనిచ్చింది.
కాగా శిశువులో ఎలాంటి చలనం లేకపోవడంతో 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. అనంతరం శిశువుని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు, తల్లిని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి శిశువు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి బాధిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Medical College | ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్.. 10 మందిని సస్పెండ్ చేసిన డైరెక్టర్..!
Osmania University | డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
Patnam Narender Reddy | పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు : పట్నం నరేందర్ రెడ్డి