ఆరేండ్లలో ఆడబిడ్డలకు ఉచితంగా 5,79,01,110 బతుకమ్మ చీరలు
- నేతన్నలకు చేతినిండా పని, పెరిగిన జీవనప్రమాణాలు
- ఈ ఏడాదికి సిద్ధమైన చీరలు, త్వరలో జిల్లాలకు రవాణా
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచిరోజులొచ్చాయి. ఆధునిక యంత్రాలతో బడా కంపెనీలు వస్ర్తాల తయారీ రంగంలోకి రావడంతో ఆత్మహత్యలే శరణ్యమనుకొన్న నేతన్నలకు సీఎం కేసీఆర్ చేతినిండా పని కల్పించి ఆదుకొన్నారు. ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే వస్ర్తాలే కాకుండా బతుకమ్మ చీరలను వారితో నేయించి ఏడాది పొడవునా ఉపాధి చూపించారు.
తద్వారా నెలకు కనీసం రూ.20 వేలకు తగ్గకుండా ఆర్థిక ప్రయోజనం కలిగే ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేండ్లలో రూ.1,804 కోట్లు వెచ్చించింది. తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. 18 ఏండ్లు పైబడిన పేద మహిళలకు గత ఆరేండ్ల నుంచి ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం విదితమే.
ఈ చీరల తయారీ బాధ్యతను పవర్లూమ్ నేతన్నలకు అప్పగించడంతో వారికి ఏడాది పొడవునా ఉపాధి లభించి జీవనప్రమాణాలు మెరుగయ్యాయి. ఏటా 95 లక్షల నుంచి కోటి బతుకమ్మ చీరలను తయారు చేయిస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది కోటి చీరలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందుకోసం రూ.338 కోట్లు కేటాయించింది. ఈ చీరల తయారీ దాదాపు పూర్తికావడంతో వచ్చే నెల 10లోగా ప్యాకింగ్ పూర్తిచేసి జిల్లాలకు రవాణా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 25న బతుకమ్మ పండుగ నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

