హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నిరుడు 576 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
లొంగిపోయి గుర్తింపు లేని వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ నుంచి వెళ్లి వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న 17 మంది మావోయిస్టులు లొంగిపోవాలని పోలీసు శాఖ కోరింది.