Work Stress | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్’ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు చెందిన 260 మంది వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ ప్రొఫెషనల్స్ సర్వే చేశారు. పని ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితి, ఎక్కువ సమయాలు పనిచేయడం వల్ల నిద్రకు దూరమవుతున్నట్టు వారు పేర్కొన్నారు. కేవలం నిద్ర లేకపోవడంతోనే ఉత్పాదకత, ఏకాగ్రత, ఉద్యోగ సంబంధిత పనులు సమర్థవంతంగా చేయలేకపోతున్నట్టు 80 శాతం మంది వివరించారు.
సర్వేలో గుర్తించిన ఆసక్తికర అంశాలు…