వాజేడు, మార్చి 2: ములుగు జిల్లా వాజేడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వ్యాక్సిన్ అందక 55 రోజుల పసికందు మృత్యువాత పడింది. గుడిసెలకాలనీకి భారతి, బాలకృష్ణ దంపతులకు 55 రోజుల పాప ఉంది. పాపకు నిమ్ము రావడంతో వారం క్రితం వాజేడు పీహెచ్సీలో చూపించారు. వ్యాక్సిన్ అందుబాటులో లేదని, పాపను ఏటూరునాగారం దవాఖానకు తరలించారని వైద్యులు చెప్పారు.
అక్కడికి వెళ్లగా వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించాలని సూచించారు. చిన్నారి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లకుండా ఆర్ఎంపీ వద్ద చూపించగా, అతడు టానిక్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో పాప ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై, పరిస్థితి విషమించగా ఆదివారం వాజేడు పీహెచ్సీకి తరలించారు. పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.