PM Shri schools | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
ఈ విద్యాసంవత్సరం వీటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. దేశవ్యాప్తంగా 14,500 బడులను ఈ పథకం కింద అభివృద్ధి చేయనుండగా, ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో రూ. 27, 360 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించనున్నాయి. కేంద్రం తన వాటాగా రూ. 18,128 కోట్లను ఖర్చుచేయనున్నది. ఈ పథకంలో భాగంగా బడులల్లో సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ రహిత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.