హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 54 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. 2023- 24 విద్యాసంవత్సరానికిగాను ఉత్తమ టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. హెచ్ఎం క్యాటగిరీలో 10, స్కూల్ అసిస్టెంట్ 20, ఎస్జీటీ/ టీజీటీ/ పీజీటీ 11, డైట్ లెక్చరర్ 1, స్పెషల్ క్యాటగిరీలో 12 మంది టీచర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లతోపాటు గురుకుల విద్యాలయాల్లోని టీచర్లు, డైట్ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులను అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నెల 5న రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో వీరిని సన్మానిస్తారు. అవార్డు కింద రూ.10వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్‌ను అందజేస్తారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అధ్యక్షత వహించనుండగా, సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ ఏడాది గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల ఎంపిక కోసం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 97 మంది టీచర్లతో కూడిన జాబితాను ప్రతిపాదించింది. తుది ఎంపికలో 54 మందికి బెస్ట్ టీచర్ అవార్డులు దక్కాయి.
ఉత్తమ టీచర్లు వీరే
జీహెచ్ఎం/ ప్రిన్సిపాల్ క్యాటగిరీ
సెంకడరీ గ్రేడ్ టీచర్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం క్యాటగిరీ
స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ క్యాటగిరీ
స్పెషల్ క్యాటగిరీ
లెక్చరర్ల క్యాటగిరీ