హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 53 మందిని టీజీపీఎస్సీ ఎంపికచేసింది. రీలింక్విష్మెంట్ ద్వారా వారిని ఎంపికచేసింది. వివరాలను https:// www. tspsc.gov. in వెబ్సైట్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.