హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 52ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. 6 నుంచి 19 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని పేర్కొన్నారు. చర్లపల్లి-తిరుపతి, వికారాబాద్-కాకినాడ, కాచిగూడ-తిరుపతి, నర్సాపూర్-చర్లపల్లి, సికింద్రాబాద్-కాకినాడ, నాందేడ్-కాకినాడ, చర్లపల్లి-శ్రీకాకుళం స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. వివరాలకు ఎస్సీఆర్ వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.