Kamareddy | బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 2: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు దవాఖాన సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఒక్క నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు జరిగిన దవాఖానగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆగస్టులో 504 ప్రసవాలు చేశామని, అందులో 64 శాతం సాధారణ ప్రసవాలేనని దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పీ శ్రీనివాస్ప్రసాద్ వెల్లడించారు. మూడు నెలలగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తున్నట్టు తెలిపారు. సాధారణ ప్రసవాలకు చొరవ చూపుతున్న గైనిక్ విభాగం హెడ్ డాక్టర్ సుధా, సపోర్టింగ్ నర్సిం గ్, థియేటర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శనివారం దవాఖానలో వైద్య సిబ్బంది సంబురాలు నిర్వహించారు. ప్రసవాల్లో బాన్సువాడ దవాఖాన మొదటిస్థానంలో నిలువడంపై స్పీకర్ పోచారం హర్షం వ్యక్తం చేశారు.