శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణాణ): విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ మం జూరు చేసే క్రమంలో లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… గోపనపల్లి సాయినగర్ హౌసింగ్ కాలనీలో అపార్ట్మెంట్ నిమిత్తం ట్రాన్స్ఫార్మర్ కావాలని ఓ వినియోగదారుడు విద్యుత్తు శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ మంజూ రు చేయాలంటే లక్ష రూపాయల ఇవ్వాలని గచ్చిబౌలి ఏడీఈ కొట్టే సతీశ్ సదరు వినియోగదారుడిని లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఫిబ్రవరి 6వ తేదీన రెండు ట్రాన్స్ఫార్మర్లకు కలిపి రూ. 75000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగా ఈనెల 7న అడ్వాన్స్ రూపంలో రూ. 25 వేలు ఏడీఈ సతీశ్‌కు ఇచ్చాడు. మిగతా రూ. 50 వేలను శుక్రవారం అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంలో ఏడీఈ సతీశ్‌కు ఇస్తుండగా, అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బృందం ఏడీఈని సతీశ్‌ను రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్లినప్పుడు అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్లు సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు.
భూమి సర్వేకు 12 వేలు లంచం ; ఏసీబీకి చిక్కిన మర్రిగూడ సర్వేయర్
మర్రిగూడ, ఫిబ్రవరి 14 : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన రైతు సర్వే నంబర్ 366లోని వ్యవసాయ భూమికి కొలతలు వేయాలని సర్వేయర్ లావుడ్యా రవినాయక్‌ను కోరారు. రవి లంచం డిమాండ్ చే యగా, 12 వేలకు ఒప్పందం కుదిరింది. శు క్రవారం తహసీల్ కార్యాలయంలోని రికార్డు గదిలో సర్వేయర్ రవినాయక్ రైతు నుంచి 12 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న ట్టు ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపారు.